Song Details
Lyrics
మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే రాముడు అడవికి వెళ్లేనా నువ్వే అన్నై ఉండుంటే ఏసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే ఆన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే తమకున్నదొక్కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఇంతటి చక్కని బంధాన్ని కాలం ఆగి చూసేను రాత రాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను తపమేమి చేశామో తమ్ముల్లమ్మయ్యాములే తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యములే మా దేవుడు మాకుండగా మరి మాకిక లోటేది కలతకు చోటేది మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలోగిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పున్నమే
Lyrics sourced from public databases. May contain errors.