Song Details
Lyrics
పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా ఏదో పాపం పసివాణ్ణి జాలిచూపి వదలండి మన్నించండి అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా వలను కొరికే చేప నేను... ఎరను చూసి మోసపోను వెకిలివేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పగా యముడిలా వాడు వెనక వున్నాడు తెలుసునా తెలియజెప్పనా వద్దు వద్దు బాబోయ్ తప్పుకాయ్ తల్లోయ్ చెంపలేసుకుంటా గోడకుర్చీ వేస్తా మొన్ననే నేను కళ్ళుతెరిచాను ఇంతలో నన్ను బూచాడికి ఇచ్చెయకు అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా పోని పాపం అనుకుంటే తనువే ముదిరిందే మరియాదేనా పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా విలువ తెలిసే వెతికి చేరా బ్రతుకు నీతో ముడినివేసా దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా మనసులో మాట తెలుసుకోవమ్మా చెలిమితో కలిమి కురియవా చిన్నవాడ నిన్ను నమ్ముతాను లేవోయి అల్లరెందుకు ఇంకా పల్లకిని తేవోయి కోతివేషాలు మానితే చాలు నిన్ను వెన్నంటే వుంటాను ఏనాడు పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా ఏదో పాపం పసివాణ్ణి జాలిచూపి వదలండి మన్నించండి అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా
Lyrics sourced from public databases. May contain errors.