MovieGQ

O Manmadhuda

King (2008) · Track 3 of 9

Song Details

Singers
Music Director

Lyrics

చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర మాట చాలు ఓ మాళవిక ఆగలేదు నా ప్రాణమిక తెలుసులే అందమా నీ మనసులో సరిగమ కలుపుకోవ నన్ను నీలో యుగయుగాల కౌగిలిగా కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర చరణం: 1 చేరిపోని నీ ఎదపైన వాలిపోనిది వయసేన తేనే తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా నింగి జారి తళుకుల వాన కమ్ముకుంటే కాదనగలనా అందమైన అధ్బుతాన్నిలా దరికి పిలిచుకోన ఓ లాలించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో తెలుసులే అందమా నీ మనసులో సరిగమ చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర చరణం: 2 ఆడ మన్స్సులో అభిలషా అచ్చ తెలుగులో చదివేశా అదుపు దాటి వరదైంది ఈ చిలిపి చినికు వరస నన్ను నేను నీకొదిలేశా ఆదమరుపులో అడుగేశా అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలపు తెరిచా అనుకున్న కొన్ని అనలేని వన్ని ఆరాలు తీయనా తెలుసులే అందమా నీ మనసులో సరిగమ చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడా తెలుసుకో సుందరా నా మనసులో తొందర తెలుసుకో సుందరా నా మనసులో తొందర

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from King

See All