MovieGQ

Emo Emo

Katamarayudu (2017) · Track 4 of 7 · 4:15

Song Details

Lyrics

ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో చిర చిర లాడే కంట్లో చెక్కెర దారేంటో చినుకులు చూడని ఇంట్లో తేనెల వానేంటో ప్రతి దానికింక కారణంగా నిన్ను చూపుతుంది ఈ లోకం నీ కయ్యిందేంటో నే చేసిందేంటో ఏమో ఏంటో హో నే చెప్పిందేంటో నా తప్పసలేంటో ఏమో ఏంటో ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో మండేటి సూర్యుడినైన చల్లార్చే చందమామై నువ్వొచ్చావా నాకోసం ఈ అదృష్టం ఏంటో గర్జించే మేఘాన్నైనా కరిగించే చల్లగాలి నువ్వు కలిసావ ఈ నిమిషం నా అదృష్టం ఏంటో పేలే శబ్దాలెన్నైనా ఏం చెయ్యలేదే ఇన్నాళ్లు ఇవ్వాలే నిశ్శబ్దంలో హాయిగ వచ్చే వణుకేంటో నాలో ఉండే పడుచుదనం నీలో ఉందే పదునుగుణం ఒకటైపోతే మన పయణం అటుకో ఇటుకో ఎటుకో ఏంటో ఓ ఏమో ఏమో ఏంటో ఏమైందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మల్లె పూసేసిందేంటో ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో శత్రువుల గుండెల్లోన నిద్రిస్తు ఉందే నాకే నిన్ను చూస్తే నిద్దుర పాడై ఈ గుండె గుబులేంటో కత్తుల్లా కదిలే నువ్వే మెత్తంగా మునిగావంటే చంటోడైన చెబుతాడే అరే దానర్థం ఏంటో అందరిలోన హుందాగా నిన్నా మొన్నా ఉన్నాగా ఈపై ఎట్టాగుంటానో ఆపై జరిగే కధలేంటో అక్కడితోనే గడపకురో కంచె పట్టు పరికిణిలో నీకై వచ్చే నిలిచుంటే అరరె అరెరే తెలుసా ఏంటో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Katamarayudu

See All