Song Details
Lyrics
చిలకమ్మ పలికిందీ..చిగురాకు కులికిందీ (2) చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే.. నీ లేత సింగార మొలికించవే.. గోరొంక కూసింది..గోరింట పూసిందీ.. ముత్యాల మనసీయ రా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా... నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా... పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ... ఆ ఆహాహహాఆహ పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ.. ఈ సిగ్గు బరువు నేనోపలేను (2) నీ కంటి పాపలో దాచుకో నన్నూ.. దాచుకో నన్నూ.. కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ... ఆ ఆహాహహాఆహ కొండ వాగుదూకితే తెలిసిందీ.. కోడె వయసు పోగిందనీ.. ఈ వయసు హోరు నేనాపలేను (2) నీ కౌగిలింతలో దోచుకో నన్నూ...దోచుకో నన్నూ..
Lyrics sourced from public databases. May contain errors.