MovieGQ

Aaraneekuma Ee Deepam

Karthika Deepam (1979) · Track 1 of 6

Lyrics

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం ఇదేసుమా నా కుంకుమ తిలకం ఇదే సుమా నా మంగళ సూత్రం ఇంటిలోన నా పాప రూపునా గోరంత దీపం.. కంటి కెదురుగా కనబడు వేళల కొండంత దీపం నా మనస్సున వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం.. ఆకాశానా ఆమణిదీపాలేముత్తైదువులుంచారో ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు.. ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే.. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం నా నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం ఎటనైనా ఎపుడైనా నే కొలచే కళ్యాణ దీపం నేవలచే నా ప్రాణ దీపం.. ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం.. చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Karthika Deepam

See All