Song Details
Lyrics
పల్లవి: అధికులనీ.. అధములని... నరుని దృష్టిలోనే భేదాలు శివుని దృష్టిలో... అంతా సమానురే.... ఏ... ఏ... ఏ... ఏ.. నందుని చరితము వినుమా.. ఆ.. ఆ.. పరమానందము గనుమా.. ఆ.. ఆ పరమానందము గనుమా..ఆ.. నందుని చరితము వినుమా.. ఆ.. ఆ పరమానందము గనుమా... ఆ... ఆ పరమానందము గనుమా... చరణం: 1 ఆదనూరులో మాలవాడలో.... ఆదనూరులో... మాలవాడలో... పేదవాడుగా జనియించి చిదంబరేశ్వరుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను... నందుని చరితము వినుమా.. ఆ.. ఆ పరమానందము గనుమా... ఆ... ఆ పరమానందము గనుమా... చరణం: 2 తన యజమానుని ఆనతి వేడెను... శివుని చూడగా మనసు పడి తన యజమానుని ఆనతి వేడెను... శివుని చూడగా మనసు పడి పొలాల సేద్యము.. ముగించి రమ్మని... పొలాల సేద్యము... ముగించి రమ్మని గడువే విధించె యజమాని... యజమాని ఆనతిచ్చిన గడువులో... ఏ రీతి పొలము పండిచుటో ఎరుగక.. అలమటించు తన భక్తుని కార్యము... ఆ శివుడే నెరవేర్చె... ఏ... ఏ.. ఏ.. ఏ... పరుగున పోయెను చిదంబరానికి... భక్తుడు నందుడు ఆత్రమున పరుగున పోయెను చిదంబరానికి... భక్తుడు నందుడు ఆత్రమున చిదంబరములో శివుని దర్శనం... చేయగరాదనె పూజారి... ఆశాభంగము పొందిన నందుడు... ఆ గుడి ముందే మూర్చిల్లె అంతట శివుడే అతనిని బ్రోచి... పరంజ్యోతిగా వెలయించె...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Jayabheri
See AllMadi Saaradadevi Mandirame
P.B. Srinivas, Ghantasala, Raghunath Phanigrahi
Unnara Jodunnara Nannodinche Varunnara
P. Susheela, Madhavapeddi Satyam
Savaal Savaalane Chinadhana
Ghantasala, P. Susheela
Ragamayi Rave Anuragamayi Rave
Ghantasala
Ravoyi Raasavihari
P. Susheela, Ghantasala
Sangeeta Sahityame
Ghantasala, P. Susheela
Neeventa Nerajanavouraa
M.L. Vasantha Kumari
Rasika Raja Taguvaaramu
Ghantasala
Shuklaam Brahma (Slokam)
M. Balamuralikrishna
Indralokamu Nundi Idi Techinaanayya
S. Janaki, Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao
Hey Vallopadaliraa Pedda Chepa
Ghantasala, P. Susheela, Madhavapeddi Satyam
Daivam Neevenaa Dharmam Neevenaa
P. Susheela, T.M. Soundarrajan
Needana Nannadira
Ghantasala
Saranaagata
Ghantasala
Yamunaa Teeramuna Sandhya Samayamuna
Ghantasala