MovieGQ

Aadhi Lakshmivanti Athagaarivamma (Padyam)

Jagadeka Veeruni Katha (1961) · Track 11 of 15

Lyrics

పల్లవి: ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ సేవలంది మాకు వరములీయవమ్మ సేవలంది మాకు వరములీయవమ్మ ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా... చరణం: 1 కలుగునే మీ వంటి సాధ్వి అత్తగా మాకు తొలి మేము చేసిన పుణ్యమున గాక ఆ మందార మాలతీ పారిజాతాలతో అందముగ ముడివేసి అలరజేసేము ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ సేవలంది మాకు వరములీయవమ్మ ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ చరణం: 2 మనసు చల్లగ కాగ మంచిగంధము పూసి మా ముచ్చటలు తీర్ప మనవి చేసేము ఆ పారాణి వెలయించి పాదపూజను చేసే కోరికలు తీరునని పొంగిపోయేము ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ సేవలంది మాకు వరములీయవమ్మ సేవలంది మాకు వరములీయవమ్మ ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jagadeka Veeruni Katha

See All