Song Details
Lyrics
నీకోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కను రెప్పలపై కమ్మని స్వప్నం స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపం ఆరూపం ఆ సెలయేరై పోసెను జీవం వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో అలలపై నీ కోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కను రెప్పలపై కమ్మని స్వప్నం మండే హృది జ్వాల ఆరిపోవాలా నన్నువడి చేర్చుకో పాపలా మది భారంగా మారే భాష్పంగా నువ్వు లేకుండ నవ్వేదెలా వస్తున్న వస్తున్న నీకై నేనేనీవై చేస్తున్న నీకై నే గానమె ప్రియతమా పదిలమా కిరణమై తాకుమా నీకోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కను రెప్పలపై కమ్మని స్వప్నం ప్రేమే లోకంలా నేనో శోకంలా ఇంత గరళాన్ని దాచేదెలా చేసేనే దూరం ఎదకు ఆ గాయం ఇంక ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ దైవం వేసిందో ఎమో నీతో బంధం గుండెల్లో గుప్పున ఎగసె వలపుల బంధం మేఘమా అందుమా చినుకువై రాలుమా నీకోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కను రెప్పలపై కమ్మని స్వప్నం స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపం ఆరూపం ఆ సెలయేరై పోసెను జీవం వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో అలలపై
Lyrics sourced from public databases. May contain errors.