Song Details
Lyrics
దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మ దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ ఒహో... హో... ఒళ్ళో వాలుమా ఒహో... హో... వయసే ఏలుమా నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ టక టకమంటు తలపును తట్టి తికమకపెట్టే లుకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే మగసిరి పట్ట కథ ముదిరితే ఎట్టా కేరింతలాడుతు కవ్వించలేవా కాదంటే ఇపుడు తప్పేదెలా అరె కాదంటే ఇపుడు తప్పేదెలా నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా ఒహో... హో... కోరిందే కదా ఒహో... హో... మరీ ఇందిర మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే పాప గమనించవే మా కొంప మునిగిపోయే పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా సొగసుల బరువా ఓ తుంటరి మగువా నునుపులు ఇట్ట ఎదురుగ పెట్టా ఎగబడ లేవా తగు జతకావ నా వరసై పోవా అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా ఆ కళ్యాణ ఘడియ రానీయవా అరె అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా నీ హితబోధలాపి శృతిమించవా ఒహో... హో... వాటం వారెవా ఒహో... హో... ఒళ్లోవాలవా అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే
Lyrics sourced from public databases. May contain errors.