MovieGQ

Vasanthala Ee Gaalilo

Idhi Maa Ashokgaadi Love Story (2003) · Track 6 of 6

Lyrics

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు ఇవేనాటి క్రీనీడలో హుషారాలనేరెండలు కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ మేఘాల సందేశమూ ఆ ప్రేమ విరిజల్లులే స్వప్నాల సంకేతమూ ఎదలోని హరివిల్లులే మైనాన సంగీతమూ ఈ పూల గంధాలులే ప్రతిరోజు సాయంత్రమూ నీ వేడి నిట్టూర్పులే అది శోకమో ఒక శ్లోకమో ఈ లోకమే ప్రేమెలే వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ ప్రేమించే నా కళ్ళకూ నిదురన్నదే రాదులే ప్రేమించే నా వాళ్ళకూ ఏ ఆకలి లేదులే ఊహల్లో విహరింపులూ ఉయ్యాల పవళింపులూ వెన్నెల్ల వేధింపులూ వెచ్చంగ లాలింపులూ అది యోగమో అనురాగమో పురివిప్పు ఈ ప్రేమలో వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు ఇవేనాటి క్రీనీడలో హుషారాలనేరెండలు కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idhi Maa Ashokgaadi Love Story

See All