MovieGQ

Ukku Naram

Guru (2017) · Track 3 of 6 · 3:03

Song Details

Lyrics

నీకేమి తక్కువ నిన్నే నువ్ గుర్తించవ నీలోను ఉంది చూడు ఉక్కునరం నువ్వేంటో చూపించవ నిన్నే నువ్ గెలిపించవ నీకే తెలియని నీలో సత్తా ఉక్కునరం ఉక్కునరం (4) అమ్మా నాన్న పుడుతూనే పెట్టారు పేరు అందరిలాగ నీకోటి రంగుల్లోన వెలిగేలా ఆ పేరు నేడు సాధించాలి ఏదోటి గమ్యం లేని గాలల్లే తిరిగావంటే ఏం లాభం కలలకు ఊపిరి పోయాలి నీ ఉక్కు నరం స్వాగతమంటు పిలిచింది నలుదిక్కుల్లో మైదానం జెండా ఎగరెయ్యాలి నీలో ఉక్కునరం ఉక్కునరం నీలో దాగున్న సైన్యం ఉక్కునరం నిన్నే నడిపించు ధైర్యం ఉక్కునరం నీలో దాగున్న సైన్యం ఉక్కునరం ఉక్కునరం (4) నీలో బలం ఇంతేనని హే గీతల్లోన ఒదగకు ఇంకేముందో చూద్దామనే ఆలోచనని వదలకు నొప్పి లేని పోరాటం ఏ గొప్ప ఇవ్వదులే నిప్పుల నడకలు తప్పవులే ఓ... గమ్యం చేరే దారుల్లో గాయాలన్ని మామూలే ప్రతి ఆట పొరాటమంటూ పట్టు బిగించు ఉక్కునరం నీలో దాగున్న సైన్యం ఉక్కునరం నిన్నే నడిపించు ధైర్యం ఉక్కునరం నీలో దాగున్న సైన్యం ఉక్కునరం ఇంతే చాలు అనే నీ ప్రయాణం కోరే గమ్యాన్ని సాధించదే ఇంకా ఇంకా అనే నీ ప్రయత్నం ఏనాడూ తలొంచదే ఉక్కునరం (8)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Guru

See All