Song Details
Lyrics
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ... మధురవదన నళిననయన మనవి వినరా రామా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట రామ చక్కని సీతకి... చరణం: 1 ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి... చరణం: 2 ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు రామ చక్కని సీతకి... చరణం: 3 చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే చూసుకోమని మనసు తెల్పి మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట ఇందువదన కుందరదన మందగమన భామా ఎందువలన ఇందువదన ఇంతమధన... ప్రేమా...
Lyrics sourced from public databases. May contain errors.