Song Details
Lyrics
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నదీ బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ పాడె ఎత్తటానికే స్నేహమన్నదీ కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చరణం: 1 పోయినోడు యిక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ కన్నీళ్లకు కట్టేకూడా ఆరనన్నదీ చావు బ్రతుకులన్నవి ఆడుకుంటవీ చావులేని స్నేహమే తోడువుంటదీ... చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
Lyrics sourced from public databases. May contain errors.