MovieGQ

Brahma Oh Brahma

Gemini (2002) · Track 5 of 8

Song Details

Music Director
Lyricist

Lyrics

బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా జాబిల్లిలా వుంది జాణా ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో యింత అందాన్ని ఈ రోజే చూశానుగా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా చరణం: 1 నీలాల ఆ కళ్లలో నీరెండ దాగున్నదో ఆ లేడి కూనమ్మ ఈ వింత చూసింద ఏమంటదో ఆ పాల చెక్కిళ్లలో మందారమే పూచేనో ఈ చోద్యమే చూసి అందాల గోరింట ఏమంటదో నా గుండె దోసిళ్లు నిండాలిలేనాడు ఆ నవ్వు మత్యాలతో ఈ జ్ణాపకాలన్ని నే దాచుకుంటాను ప్రేమతో బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా చరణం: 2 నూరేళ్ల ఈ జన్మనీ ఇచ్చింది నువ్వేననీ ఏ పూజలూ రాని నేనంటే నీ కెంత ప్రేముందనీ ఈ వేళ ఈ హాయినీ నా గుండెనే తాకనీ అందాల ఆ రాణి కౌగిళ్లలో వాలి జీవించనీ ఆ పంచభూతాలు ఒక్కొక్కటై వచ్చి చల్లంగ దీవించనీ తన చెంతకే చేరి ఏ రోజు చెప్పాలి ప్రేమనీ బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా జాబిల్లిలా వుంది జాణా ఆ నవ్వు మీటింది వీణ ఏడేడు లోకాలలో యింత అందాన్ని ఈ రోజే చూశానుగా బ్రహ్మ ఓ బ్రహ్మ మహ ముద్దుగా వుంది గుమ్మ బొమ్మా ఈ బొమ్మా అరె అందానికే అందమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gemini

See All