Song Details
Lyrics
చాల్లేగాని ఏంటా పరాకు ఉన్నట్టుండి ఏమైంది నీకు అయ్యో అని worryఐపోకు tell me అని enquiryలన్ని ఎందుకు మాతోనే నువ్వుంటూ మా ఊసే పట్టనట్టు ఏదోలా ఎందుకుంటావ్ నీదీలోకం కాదన్నట్టు ఒదిగుందే లోని గుట్టు కదిలిస్తే తేనె పట్టు వదలదుగా వెంటపడుతు నాకేం తెలుసిది ఇంతేనంటు మునిగేదాక లోతన్నది కొలిచే వీలు ఏమున్నది పరవాలేదు అంటున్నది ప్రేమలో పడ్డది ఆమె చెంపలా కందిపోవడం ఏమి చెప్పడం ఎంత అద్భుతం అందుకే కదా కోరి కోరి కయ్యాలు అతని కోసమే ఎదురుచూడటం బ్రతిమలాడి తను అలక తీర్చడం పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు జంటలెన్ని చెబుతున్నా ఎన్ని కథలు వింటున్నా అంతుబట్టదే ప్రేమ ఏనాటికైనా విన్నాగాని అంటావేగాని ఏమంటోంది ఆకాశవాణి చూసాగాని వేరే లోకాన్ని ఏంచెప్పాలి చూపించే వీలులేదని పక్కకెళ్ళిపో పాడు మౌనమా కరగవెందుకే కొద్ది దూరమా బయటపడని జత ఏదో చూసుకోరాదా ఎంతసేపు ఈ వింత dilemma కథని కాస్త కదిలించు కాలమా to be not to be debate ఎంతకీ తెగదా కొత్త దారిలో నడక ఇప్పుడిప్పుడే గనక తప్పదేమో తడబడక అలవాటు లేక ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను నువ్వొచ్చాక ఏమైపోయాను నీతో ఇలా అడుగేస్తున్నాను ఏవైపంటే ఏమో ఎలాగ చెప్పను
Lyrics sourced from public databases. May contain errors.