Meghale Thele Naalona
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Sai Charan
Lyrics
- మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన
ఆ గువ్వలకే కొమ్మవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్న
మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన
ఈ గాలులు అల్లగా మనపై వార్తలు మెల్లగా
ఆ చందమామ గారు కూడా విన్నారట
ఆ జాబిలి చెప్పగా అరె ఈ సూర్యుడు నవ్వగా
వేసంగి పొంగు వెన్నెలల్లే కాసింది గా
పరుగులు ను ఆపి - కాలమే
కబురులిని మనకే - చెప్పెనే
ఏకాంతాలన్ని మన కాంతులకే పారిపోయే
మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన
ఆ గువ్వలకే కొమ్మవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్న
ఏ జల్లులు జారిన అలుపే లేదే ఒంటికి
చినుకమ్మ నీరు ఇంకి పోయే ఈ హాయికి
ఏ వేసవి కాసినా అలుపే తెలియదు మనసుకి
ఎండమ్మ గుండె వెన్నెల అయ్యే ఈ తీపికి కి
ఏ తీరమో ఇక - చివరికి
ఇక చాలులే పద - ఇంటికి
ఏ ఇల్లు వాకిలి వద్దే వద్దు ఈ ప్రేమకి
మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన
ఆ గువ్వలకే కొమ్మవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్న
Fashion Designer S/O Ladies Tailor
Movie More SongsMeghale Thele Naalona Keyword Tags
-
-