Song Details
Lyrics
పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందోయి తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో నువు టక్కరి దొంగవు కదా గడసరి జోడీ నువు కదా ఇక చెప్పకు తీయని సొద పిలిచెను నేడే ప్రతిపొద దోర దోర సొగసిదీ దొరకక దొరికిన పులసిదీ పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందోయి తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో నీ వెనకే నీడలా - ఉన్నావయ్యా కొన్నాళ్ళుగా! నీ అడుగూ జాడలా - వచ్చావయ్యా కంగారు పడగా! నువు నవ్వితే హాయిగ నేనూ - నవ్వావయ్యా నవాబులా! నువు నవ్వని వేళల నేను - చూసానయ్యా దిగాలు పడగా! పిచ్చోడి లాగ తిరగనీ వయసిక వరదగ ఉరకనీ! పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందోయి తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో వాటముగా రాయిక - వచ్చా వచ్చా వచ్చానులే! ఈ ఇసుకే వేదిక - ఇచ్చా ఇచ్చాను కానుకే! చలి గిచ్చిన వేళల లోన - అయ్యో గియ్యో అన్నానులే! నులి వెచ్చని కౌగిలి లోన - వయ్యారాన్నే వడ్డించి వేస్తిలే! పింఛాలు లేని నెమలినీ మనసున సొగసుగ నమలనీ పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందోయి తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో
Lyrics sourced from public databases. May contain errors.