Swathi Muthyamala
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది
సిగ్గుపడ్డ చీర
కట్టువీడి జారిపోయింది
కొంగు చాటు అందాలు
కన్నుకొట్టి రమ్మంటే
వయసాడమంది సయ్యాట
ఇది యవ్వనాల పూదోట
స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది
పెదవితో పెదవి కలిపితే
మధువులే కురియవా
తనువుతో తనువు తడిమితే
తపనలే రగలవా
తొందరెందుకంది కన్నెమనసు
పూలతీగలాగ వాటేసి
ఊయలూగమంది కోరవయసు
కోడెగిత్తలాగ మాటేసి
కవ్విస్తున్నది పట్టెమంచము
రావా రావా నారాజా
స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది
సిగ్గుపడ్డ చీర
కట్టువీడి జారిపోయింది
మేఘమా మెరిసి చూపవే
గడసరి తళుకులు
మోహమా కొసరి చూడవే
మగసిరి మెరుపులు
కొల్లగొట్టమంది పిల్ల సొగసు
కొంటె కళలన్ని నేర్పేసి
లెక్కపెట్టమంది సన్నరవిక
ముద్దులెన్నో మోజు తీర్చేసి
పరుపే నలగని పరువం చిలకని
మళ్ళి మళ్ళి ఈవేళ
స్వాతిముత్యమాల
ఒళ్ళుతాకి తుళ్ళిపోయింది
సిగ్గుపడ్డ చీర
కట్టువీడి జారిపోయింది
కొంగు చాటు అందాలు
కన్నుకొట్టి రమ్మంటే
వయసాడమంది సయ్యాట
ఇది యవ్వనాల పూదోట
వయసాడమంది సయ్యాట
ఇది యవ్వనాల పూదోట
Chinarayudu
Movie More SongsSwathi Muthyamala Keyword Tags
-
-