Bullipitta 2
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్లే ఇట్టా గడిచేది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్లే ఇట్టా గడిచేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
చరణం: 1
నిన్నే తలుచుకుంటు ప్రాణం నిలుపుకుంటు
నీకై నిలిచి ఉంది శ్వాస
కాలం కరుగుతున్నా శోకం పెరుగుతున్నా
ఏదో జరుగునన్న ఆశ
పూమాల వాడలేదు పారాణి ఆరలేదు
అయినా లోకం జాలి చూపదే
నీ గుండె చప్పుడింక నా గుండె చేరలేదు
అయినా అయినా కథ మారదే
కష్టాలన్నీ గాయాలే
అవి కాలంతోటే మానాలే
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట చెట్టుమీద పాలపిట్ట
ఊరిలోని గోరువంక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
చరణం: 2
నువ్వే దేవుడివన్న ఊరే నిందిస్తూ ఉంటే
చెప్పలేని గుండె కోత
కళ్లే కలుపుకుని ఎన్నో కలలుగన్న వేళే కాటేసింది బాధ
మురిపాన కట్టుకున్న పొదరిల్లు కూలిపోతే
ఎదలో రగిలే మంటలారునా
నూరేళ్ల పంట ఇట్టా మూణ్నాళ్ల ముచ్చటైతే
మామా మామా వ్యధ తీరునా
మళ్ళి ఎట్టా కలిసేది
నా ప్రాణం ఎట్టా నిలిపేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట చెట్టుమీద పాలపిట్ట
ఊరిలోని గోరువంక ఎట్టా ఉన్నది
అది ఎవరే ఎవరే తెలిపేది
ఎన్ని నాళ్లే ఇట్టా గడిచేది
అది ఎవరే ఎవరే తెలిపేది
నేనెట్టా ఎట్టా బతికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
పంజరాన రామచిలుక ఎట్టా ఉన్నది
Chinarayudu
Movie More SongsBullipitta 2 Keyword Tags
-
-