MovieGQ

Bullipitta

Chinarayudu (1992) · Track 1 of 8 · 4:52

Song Details

Lyrics

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేదే బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే చరణం: 1 కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు ఏదో గవ్ముత్తుగుంది మావ లేనే లేదంటు హద్దు ముద్దు ముద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు నీకే వుంచా నేను పోకిరి చక్కంగ ముందుకొచ్చి సందేళ విందులిస్తే కాదంటానా జత రా మరి వారం వర్జ్యం చూడాలి ఆపైనే నీతో వాడాలి బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే చరణం: 2 ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే ఎట్టాగమ్మో గౌరమ్మో జంటా బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను వేగేదెట్టా మావయ్యో గోరింక గూటిముందు చిలకమ్మ చిందులేసి ఆడిందంటే అర్థమేవిటో మందారపువ్వు మీద మురిపాల తుమ్మెదొచ్చి వాలిందంటే మరిదేనికో నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే ఎవరో ఎవరో తెలియుందే నేనెట్టా ఎట్టా పిలిచేది బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట నక్కి నక్కి దాగెవారి పేరు చెప్పవే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Chinarayudu

See All