MovieGQ

Tata Veedukolu Goodbye

Buddhimanthudu (1969) · Track 8 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: టా టా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా! చరణం: 1 ప్రియురాలి వలపులకన్నా నునువెచ్చనిదేది లేదని నిన్నను నాకు తెలిసింది - ఒక చిన్నది నాకు తెలిపింది ఆ ప్రేమ నగరుకే పోతాను - పోతాను - పోతాను ఈ కామనగరుకు రాను - ఇక రాను చరణం: 2 ఇచ్చుటలో వున్న హయి - వేరెచ్చటనూ లేనే లేదని లేటుగ తెలుసుకున్నాను - నా లోటును దిద్దుకొన్నాను ఆ స్నేహ నగరుకే పోతాను పోతాను పోతాను- ఈ మోహ నగరుకు రాను ఇక రాను... చరణం: 3 మధుపాత్రకెదలొ ఇంక ఏ మాత్రం చోటులేదని.... మనసైన పిల్లే చెప్పింది - నా మనసంతా తానై నిండింది నే రాగనగరుకే పోతాను అనురాగనగరుకే - పోతాను

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Buddhimanthudu

See All