MovieGQ

Gutta Meeda Guvva Koosindi

Buddhimanthudu (1969) · Track 2 of 10

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: గుట్టమీద గువ్వ కూసింది కట్టమీదకవుజు పలికింది గుడిలోన జేగంట మోగింది నా గుండెలో తొలివలపు పండింది చరణం: 1 నల్ల నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది చనువు జలరేకులై వెలిగింది చల్లా చల్లాని జల్లు కురిసింది చరణం: 2 కొమ్మమీద వాలి గోరింక కమ్మ కమ్మని ఊసులాడింది గోరింక తానింక గూడు కట్టకపోతె కొమ్మా ఎంతో చిన్నబోతుంది కొమ్మా ఎంతో చిన్నబోతుంది చరణం: 3 సన్నగాజుల రవళి పిలిచింది సన్నగాజుల దండ వేచింది మనసైన జవరాలే వలచింది మనుగడే ఒక మలుపు తిరిగింది మనుగడే ఒక మలుపు తిరిగింది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Buddhimanthudu

See All