MovieGQ

Gudilo Yemundi Babu

Buddhimanthudu (1969) · Track 7 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: గుడిలో ఏముందీ బాబూ - బడిలోనే ఉంది భుక్తి శక్తి కావాలంటే మానవ సేవ చెయ్యాలంటే దేవుడి పేరిట దోపిడి చేసే దళారులెందరో పెరిగారూ ముక్తి మత్తులో భక్తుల ముంచీ సర్వం భోంచేస్తున్నారూ నోరులేని ఆ దేవుడు పాపం నోరుగారి పోతున్నాడూ చదువుల పేరిట గుమాస్తాలనూ తయారు చేస్తూ వున్నారు ప్రభువుల్లాగా బ్రతికేవాళ్ళను బానిసలుగ చేస్తున్నారు ఉద్యోగాలకు వేటలాడమని ఊళ్ల పైకి తోలేస్తున్నారు చదవక పోతే మనిషి రివ్వునా చంద్రుని పైకి ఎగిరే వాడా ? గిర గిర తిరిగి వచ్చేవాడా ? దేవుడు చల్లగ చూడకపోతే అక్కడె గల్లంతై పోడా - ఆనవాలు చిక్కేవాడా ? చదువుల సారం హరియని హరికూడా చదవాలని చదువుల మర్మం హరియని ఆ హరికీ గురువుండాలనీ హరియే సర్వస్వమ్మని చదువే సర్వస్వమ్మనీ హరిభక్తుడు ప్రహ్లాదుడు మునుపే బల్లగుద్ది చెప్పాడు ఆ హరియే శ్రీ కృష్ణుడుగా వచ్చీ బడిలో కూర్చుని చదివాడు యీ బడిలో కూర్చుని చదివాడు చదివాడూ చదివాడూ చదివాడూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Buddhimanthudu

See All