Veyi Venuvulu Mroge Vela
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
వేయి వేణువుల మ్రోగేవేళ
హాయి వెల్లువై పొంగేవేళ
రాసకేళిలొ తేలేవేళ రాధమ్మను లాలించే వేళ
నను పాలింపగ నడచీ వచ్చితివా గోపాలా
మొరలాలింపగ తరలీ వచ్చితివా... గోపాలా
చరణం: 1
అర చెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ
అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మా
ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదుగో సత్యభామ
పొదపొదలో ఎద ఎదలో నీ కొరకై వెదుకుచుండగా
చరణం: 2
కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు
కరకు రాతి గుళ్లలో ఖైదీవై నిలిచావు
ఈభక్తుని గుండెలో ఖైదీగా వుండాలని
నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా...
మొరలాలింపగ తరలీ వచ్చితివా...గోపాల
నను పాలింపగ నడచి వచ్చితివా
- పల్లవి:
Buddhimanthudu
Movie More SongsVeyi Venuvulu Mroge Vela Keyword Tags
-
-
-



