Song Details
Lyrics
పల్లవి: ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ చరణం: 1 తళ తళ తళ తళ మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ తళ తళ తళ తళ మెరిసే సొగసు ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ పరువము వేసిన పందిరిలో బుజబుజ రేకులు పూయవలె పరువము వేసిన పందిరిలో బుజబుజ రేకులు పూయవలె ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ చరణం: 2 ఒప్పులకుప్ప వయ్యారి భామా సన్నబియ్యం ఛాయపప్పు చిన్నమువ్వ సన్నగాజు కొబ్బరికోరు బెల్లప్పచ్చు గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్ రోట్లో తవుడు నీ మొగుడెవడు హహహహ హహహ హాహహహహహ ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె ఆ...ఆ... ఆ...ఆ... ఓ...ఓ...ఓ...ఓ... ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bobbili Yuddam
See AllChellela Nee Yanna (Padyam)
Madhavapeddi Satyam
Sirinelu Rayada
Saluri Rajeswara Rao
Srikara Karunalavaala
P. Bhanumathi
Raju Kalankamurthy Ratiraju (Padyam)
Madhavapeddi Satyam
Andhala Ranive
P. Susheela, Ghantasala
Ooyala Looginadhoyi Manase
P. Bhanumathi
Paraveera Rajanya (Padyam)
Madhavapeddi Satyam
Muripinche Andhale
P. Susheela, Ghantasala
Bussi Hydarujangulun (Padyam)
Madhavapeddi Satyam
Sevalu Cheyyale O Pilla
P.B. Srinivas, S. Janaki
Ninu Chera Manasayera
P. Susheela
Yemaya Ramaya Ila Ravaya
Swarnalatha, B. Vasantha, Satya Rao
Bheeratwambuna (Padyam)
Madhavapeddi Satyam