MovieGQ

Muripinche Andhale

Bobbili Yuddam (1964) · Track 9 of 14

Song Details

Lyrics

సాకీ: సొగసు కీల్జెడలదానా సోగ కన్నులదాన వజ్రాలవంటి పల్వరుసదాన బంగారు జిగిదాన సింగారములదాన లయవైన వయ్యారి నడలదాన తోరంపు కటి దాన తొణకు సిగ్గులదాన పిడుకిట నణగు నెన్నడుము దానా.. ఆ. ఆ..ఆ… పల్లవి: మురిపించే అందాలే అవి నన్నే చెందాలే మురిపించే అందాలే అవి నన్నే చెందాలే నా దానవు నీవేలే నీవాడను నేనేలే ఆ ఆ ఆ ఆ దరిచేర రావే సఖి నా సఖీ... ప్రేయసి సిగ్గేల మరపించే మురిపాలే కరిగించే కెరటాలై మరపించే మురిపాలే కరిగించే కెరటాలై నిదురించే భావాలా కదిలించే ఈ వేళా ఆ ఆ ఆ ఆ అదే హాయి కాదా సఖా నా సఖా మురిపించే అందాలే అవి నన్నే చెందాలే చరణం: 1 చెలి తొలి చూపే మంత్రించెనే ప్రియ సఖురూపే మదినేలెనే చెలి తొలి చూపే మంత్రించెనే ప్రియ సఖురూపే మదినేలెనే ఇది ఎడపాటు కనలేని ప్రేమా ఇల మనకింక సురలోక సీమ ఇది ఎడపాటు కనలేని ప్రేమా ఇల మనకింక సురలోక సీమ ఇదే హాయి కాదా సఖా నా సఖా మురిపించే అందాలే అవి నన్నే చెందాలే చరణం: 2 అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో మధు మాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే మధు మాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే దరి చేర రావే సఖీ నా సఖీ మురిపించే అందాలే అవి నన్నే చెందాలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bobbili Yuddam

See All