Song Details
Lyrics
పల్లవి: అందాల రాణివే నీవెంత జాణవే కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా వీరాధి వీరులే రణరంగ ధీరులే ఇదేమి వింత యేల ఇంత తొందరా... వీరాధి వీరులే పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే సుఖాల తీరము ఇకెంత దూరము ఓ ఓ ఓ పరీక్ష చాలులే ఉపేక్ష యేలనే సుఖాల తీరము ఇకెంత దూరము ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది నీరిక్ష చాల మంచిదీ... వీరాధి వీరులే రణరంగ ధీరులే ఇదేమి వింత యేల ఇంత తొందరా... వీరాధి వీరులే చరణం: 1 క్రీగంటితో నను దోచి నా గుండె దొంగిలి దాచి చాటుగా మాటుగా ఆడుతే చాలులే ఆడుతే చాలులే చాలులే చాలులే శ్రీవారి హృదయము నా చెంత పదిలము నా ప్రేమ నిరతము కాపాడు కవచము అహహా ఆ ఆ శ్రీవారి హృదయము నా చెంత పదిలము నా ప్రేమ నిరతము కాపాడు కవచము ప్రియురాలి రూపము రేగించే మోహము నేనింక తాళజాలనే... అందాల రాణివే నీవెంత జాణవే కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా... అందాల రాణివే చరణం: 2 నీ వంటివారికి మేలా మేలెంచు పెద్దలు లేరా వారిదే భారము యేల ఈ ఆగము ఆగుము ఆగుము - ఆగను ఆగను ఏకాంత సమయము ఆనంద నిలయము నీవెన్ని అనినను నీ చేయి విడువను ఓ ఓ ఓ ఓ ఏకాంత సమయము ఆనంద నిలయము నీవెన్ని అనినను నీ చేయి విడువను జగానికందము వివాహాబంధము ఆనాడే తీరు వేడుకా అందాల రాణివే నీవెంత జాణవే ఇదేమి వింత యేల ఇంత తొందరా అందాల రాణివే నీవెంత జాణవే ఇదేమి వింత యేల ఇంత తొందరా... అందాల రాణివే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Bobbili Yuddam
See AllChellela Nee Yanna (Padyam)
Madhavapeddi Satyam
Sirinelu Rayada
Saluri Rajeswara Rao
Srikara Karunalavaala
P. Bhanumathi
Raju Kalankamurthy Ratiraju (Padyam)
Madhavapeddi Satyam
Muthyala Chemma Chekka
P. Susheela
Ooyala Looginadhoyi Manase
P. Bhanumathi
Paraveera Rajanya (Padyam)
Madhavapeddi Satyam
Muripinche Andhale
P. Susheela, Ghantasala
Bussi Hydarujangulun (Padyam)
Madhavapeddi Satyam
Sevalu Cheyyale O Pilla
P.B. Srinivas, S. Janaki
Ninu Chera Manasayera
P. Susheela
Yemaya Ramaya Ila Ravaya
Swarnalatha, B. Vasantha, Satya Rao
Bheeratwambuna (Padyam)
Madhavapeddi Satyam