Song Details
Lyrics
పల్లవి: చందమామ వచ్చినా చల్లగాలి వీచినా చిచ్చు ఆరదేలనమ్మా ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా చందనాలు పూసినా ఎంత సేవ చేసినా చింత తీరదేలనమ్మా ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా జంట లేదనా... ఆహాహా ఇంత వేదనా... ఓహోహో జంట లేదనా ఇంత వేదనా ఎంత చిన్నబోతివమ్మా ఓ మురిపాల మల్లిక... దరిజేరుకుంటినే పరువాల వల్లిక... ఇది మరులుగొన్న మహిమో నిను మరువలేని మైకమో ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో (2) మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో (2) ప్రణయానుబంధమెంత చిత్రమో చరణం: 1 విరిసిన వనమో యవ్వనమో పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా చలువల వరమో కలవరమో తరిమింది తీపి కోరిక చెలువను చూడగా దరిశనమీయవే సరసకు చేరగా తెరలను తీయవే తళుకుల తారక మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక చరణం: 2 కలలను రేపే కళ ఉంది అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో ఎడదను ఊపే ఒడుపుంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడ రావుగా పిలిచిన కోరిక బిడియమదేల ప్రియురాల మణిమేఖల
Lyrics sourced from public databases. May contain errors.