Song Details
Lyrics
ఆ ఆ ఆ... ఆ... ఆ... విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయచేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా చరణం: 1 ఝుమ్మంది నాదం రతివేదం జతకోరే భ్రమర రాగం రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం పరువాల వాహిని ప్రవహించే ఈవని ప్రభవించె ఆమని పులకించె కామిని వసంతుడే చెలికాంతుడై దరి చేరె మెల్లగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా చరణం: 2 ఋతువు మహిమేమో విరితేనె జడివానై కురిసె తీయగా లతలు పెనవేయ మైమరిచి మురిసేనూ తరువు హాయిగా రాచిలుక పాడగా రాయంచ ఆడగా రసలీల తోడుగా తనువెల్ల ఊగగా మారుడె సుకుమారుడై జతకూడె మాయగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయచేసినది విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
Lyrics sourced from public databases. May contain errors.