MovieGQ

Ghataina Prema Ghatana

Bhairava Dweepam (1994) · Track 2 of 6 · 3:54

Lyrics

ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగవే పసిచిలుక ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే చరణం: 1 కోరుకున్నవాడే తగువేళచూసి జతగూడే సుముహూర్తం ఎదురైనది అందమైన ఈడే అందించమంటు దరిచేరే సందేశం ఎద విన్నది లేనిపోని లోని శంక మానుకోవె బాలిక ఏలుకోవా గోరువంక లేత నీలి కానుక కులుకా రసగుళిక కళలొలుక తగు తరుణము దొరికెనుగా ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన ఆనందం చిందించెలే నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే చరణం: 2 పూజలన్నీ పండి పురివిప్పి నేను జతులాడి అనురాగం శృతి చేయగా మోజులన్నీ పిండే మగతోడు చేరు ఈనాడు సుఖభోగం మొదలౌనుగా ఊసులన్నీ మాలగా పూసగుచ్చివేయనా రాచకన్నె నేలగా దూసుకొచ్చి వాలనా కరిగా తొలకరిగా రసఝరిగా అణువణువొక చినుకవగా ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన అందంగా అమరిందిలే ఇక ఆనందం మిగిలిందిలే నిజమెరుగవే పసిచిలుక ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన ఆనందం చిందించెలే ఏ నా అందం నీ వశమాయెలే తెరమరుగిక తొలగునులే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bhairava Dweepam

See All