MovieGQ

Navami Dasami

Bavagaru Bagunnara (1998) · Track 4 of 5

Song Details

Lyrics

నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తపనలకు మకరం మిథునం వృషభ రాశులు అనుకూలించును రసికులకు దొరికినది సమయం ఓ... విరహంతో సమరం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించు నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తపనలకు ప్రాయం పెరటిలో లతలు అడిగే తొలకరి చినుకువు నువ్వే సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిదవు నువ్వే చెంగావి రంగుల్లో చేరని కంగారు రాగలే తీయని దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు తాపం వివరించు వినిపించు వికసించు నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తపనలకు స్వర్గం దారిలో పరుగు తీసే పరువపు పరవడి నీదే సర్వం దోచగా ఎదురు చూసే మధనుడి ఉరవడి నీదే కావేరి పొంగుల్లో బుడగని కస్తూరి తిలకాలే కరగని మైకం కలిగించు కవ్వించు కరిగించు మంత్రం పలికించు పులకించు పవళించు నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తపనలకు మకరం మిథునం వృషభ రాశులు అనుకూలించును రసికులకు దొరికినది సమయం ఓ... విరహంతో సమరం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bavagaru Bagunnara

See All