Nachchavura
Song
Movie
-
Music Director
-
Lyricists
- M.M. Keeravani
Singers
- Sreerama Chandra
Lyrics
- పల్లవి:
నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా
వరసే మెచ్చి అడిగావేరా..
వరమే ఇచ్చి ఈ జలధారా
నీతో ఏడడుగులు నడవాలన్నది నా కోరికరా
నీడగ తోడుండడమే ఇటు నా తీరికరా
నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా
చరణం: 1
కనిపించేదాకా చేస్తా తపసు
దేవుడు కనిపిస్తే ఏమడగాలో తెలుసు
నువ్వంటే పడిచస్తుందీ వయసు
నీవైపే లాగేస్తోంది మనసు
అలకైనా కులుకైనా నువ్వు నాతోనని
చావైనా బతుకైనా నే నీతోనని
విన్నానులే ప్రియా నీ మౌనభాషలను
వస్తానులే ప్రియా వందేళ్ల ప్రేమ బంధాలే పండించేలా
నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా
చరణం: 2
బరువెక్కిందమ్మో బ్రహ్మచర్యం
జరగాలంటుందే ఆ శుభకార్యం
అలవాటైపోతుందే నీ ధ్యానం
ఏదో పొరపాటే చేసేమందే ప్రాణం
జలధారే పులకించింది నిన్నే తాకి
కలిగేనా ఆ అదృష్టం నాకూ మరి
ఆరంగనా సఖా తరించి వేరుకా
లేదంటా నాయకా లెమ్మంటే లేచి నీ ఒళ్లో వాలెయ్యక
నచ్చావురా... వదలనురా వదలనురా
మెచ్చానురా... జతపడరా జతపడరా
Badrinath
Movie More SongsNachchavura Keyword Tags
-