Ambadari
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Revanth
Lyrics
- పల్లవి:
అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి
చరణం: 1
నువు పలికే మాటేదైనా అది నాకు పాటకచేరీ
నువు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ
నువు నిలిచే చోటేదైనా అది నాకు మధురానగరి
నీ చిలిపి పని ఏదైనా అది నాకు మన్మథ లహరి
ప్రేమా ఆ దరి విరహం ఈ దరి చివరికి విరహం చెదిరి
నిన్నా ఆ దరి నేడు ఈ దరి రేపటి తాపం ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి
చరణం: 2
క్షణమైనా విడలేనంటూ కడుతున్నా కౌగిలి ప్రహరీ
కౌగిళ్లే సరిపోవంటూ మోగించా ముద్దుల భేరి
ఉక్కసలే చాలదు అంటూ తెస్తున్నా తేనె ఎడారి
తేనెలతో తీరదు అంటూ తనువిచ్చా సరస విహారీ
సరసం ఆ దరి సిగ్గే ఈ దరి మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి భూమే ఈ దరి మధ్యన మనకే ముదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససా రిరీ గగా బదరి
ససా రిరీ గగా బదరి
అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి
ససాస రిరీ గాగ బదరి
సససస రిరీ గాగ బదరి
Badrinath
Movie More SongsAmbadari Keyword Tags
-
-