Song Details
Lyrics
పల్లవి: వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం చరణం: 1 ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో ఈ విరహాలే పెదవులు అడగని దాహాల ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల చరణం: 2 నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా సావిరహేల ఎదలను వదలని మోహాలా తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం ఓ మాజీ రే...
Lyrics sourced from public databases. May contain errors.