Song Details
Lyrics
పల్లవి: మేమడుగేస్తే అదరాలి అధికార పీఠం మే మెదురొస్తె బెదరాలి భేతాళ భూతం శక్తినివ్వు.... శక్తినివ్వు.... దేవా.... దేవా... తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే రేణువు నీవే స్ధాణువు నీవే జులుమునణచుటకు భువిని గెలుచుటకు శక్తినివ్వు నట్టేటి నావలనే నడిపించు శక్తినివ్వు చరణం: 1 మునిగేటి జీవులనే రక్షించు శక్తినివ్వు తలపొగరు సిగపట్టు కీర్తించు శక్తినివ్వు తన ఇంటి చీకటిని తోలగించేశక్తినివ్వు కాలాన్ని జ్వాలల్ని చేధించే శక్తినివ్వు నామాటతో ఊరు మారేటి శక్తినివ్వు చరణం: 2 బిగిపట్టు పట్టాక సడలించబోను ముందడుగు వేశాక వెనుకాడబోను ననునమ్ము తమ్ముళ్ళని వంచించబోను ఓనిచ్చెనై నిలుచుండి నే మోసబోను నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను నే బ్రతికేది నీ కొరకె విడిచి పోనేపోను మద్దెలను మిద్దెలను నే కోరుకోను కాలాల హద్దులను నే మించబోను దేవా...దేవా...
Lyrics sourced from public databases. May contain errors.