Dandaalayyaa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పరమడ కొండల్లో వాలిన సూరీడా
పగిలిన కోటలనే వదిలిన మారేడా
పరమడ కొండల్లో వాలిన సూరీడా
పగిలిన కోటలనే వదిలిన మారేడా
తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి
కలలో దేవుడిలా కాపై ఉంటావా
నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళం
నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకొంటూ
ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా
కడు చిందించే చెమటను తడిసే
పుణ్యం దొరికిందనుకుంటూ
పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా
నీ మాటే మా మాటయ్యా నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే తండ్రి నువ్వే కొడుకు నువ్వే
మా ఆయువు కూడా నీకయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
- పరమడ కొండల్లో వాలిన సూరీడా
Baahubali 2 - The Conclusion
Movie More SongsDandaalayyaa Keyword Tags
-
-
-