MovieGQ

Parugulu Teese

Athma Balam (1964) · Track 2 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు ఓహోయని పలికెను నీ వలపు ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు ఓహోయని పలికెను నీ వలపు ఓయని పలికెను నీ వలపునకు తీయగా మారెను నా తలపు తియ్యతీయగా మారెను నా తలపు ఒహొహొహొ హొహొహొ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు ఆహా దోబూచాడెను నా నగవు దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు దోరదోరగ పండెను నీ మరులు ఒహొహొహొ హొహొహొ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు లేదనిపించే నీ నడుము అహహ నాదనిపించెను ఈ క్షణము ఒహొ లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము ఉందో లేదో ఈ జగము ఉందువు నీవు నాలో సగము ఇది నిజము కాదనుము పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athma Balam

See All