MovieGQ

Gillikajjalu

Athma Balam (1964) · Track 1 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి చూపులతో లేని పోని గీరలొస్తాయి ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి కళ్ళలు వదిలితే కదం తొక్కుతాయి పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి కలకాలం ఉండదు ఈ పడచు బడాయి తొలినాడే చల్లబడి పోవునమ్మాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి కళ్ళు చూసి మోసపోయి కలవరించకు ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది ఎదురుతిరిగితే అదే కత్తి వంటిది గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athma Balam

See All