MovieGQ

Naalugu Kallu Rendainayi

Athma Balam (1964) · Track 5 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా కరువైనాయి కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా కరువైనాయి రెండూ లేక పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి ఇంకెందుకు నాకీ కనుదోయి నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి కదిలే శిలలా మారిపోతిని కథగానైనా మిగలనైతిని కదిలే శిలలా మారిపోతిని కథగానైనా మిగలనైతిని నిలువునా నన్ను దోచుకుంటివి నిరుపేదగా నే నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athma Balam

See All