MovieGQ

Ye Inti Ammayive

Anthaku Mundu Aa Tarvatha (2013) · Track 6 of 7

Song Details

Lyrics

ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే.. అన్నుల మిన్నుల వెన్నెల రాణీ ఎన్నడు తోడవుతావే ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే.. చరణం: 1 చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా తొలి చూపు తాకింది తొందరయ్యేలా ఆ.. చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా తొలి చూపు తాకింది తొందరయ్యేలా ఆరాట పడిపోతుందీ.. ఆరాట పడిపోతుంది అబ్బాయి జన్మ పిలిచీనా పలుకవేమే పింగాణి బొమ్మా ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ ఏ ఇంటి అమ్మాయివే.. చరణం: 2 పాపిట్లొ పారింది మా ఊరి గోదారి ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి పాపిట్లొ పారింది మా ఊరి గోదారి ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి ఎరుపెక్కే చెంపల్లోన.. ఎరుపెక్కే చెంపల్లోన తెల్లారు ఝాము నను తట్టీ లేపిందమ్మా నా మాట నమ్ము ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి జాబిల్లి చెల్లాయివే.. చరణం: 3 చామంతి మాలని పోలిన నీ చెయ్యి చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి హ్మ్ చామంతి మాలని పోలిన నీ చెయ్యి చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి వందేళ్ళూ పట్టుకుంట వందేళ్ళూ పట్టుకుంట వదిలేయకుండా గుండెల్లో పెట్టుకుంటా గూడూ కట్టుకుంటా ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే.. అన్నుల మిన్నుల వెన్నెల రాణీ ఎన్నడు తోడవుతావే ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే.. ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anthaku Mundu Aa Tarvatha

See All