Song Details
Lyrics
హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా ఓ రోజులో భవసాగరం ఈదాలనే ఆత్రంలో నూరేళ్ళని మూణ్ణాళ్ళలో చూడాలనే కంగారులో హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా చరణం: 1 ఇరుకు మంచిదేనని ఇంటి సైన్సు అంటున్నది సరిగ సర్దుకోవడం నేర్చుకోమనే మెసేజ్ అది మరకలున్న గోడ నీ మదికి అద్దమై ఉన్నది మరొక రంగు అద్దుతూ మార్చుకొమ్మనే లెస్సన్ అది బయటోళ్లపై కోపాలనే తలుపుల తెరల్లో ఆపుతూ చల చల్లని భోగాలనే ఏసీ గదుల్లో దాచుకొనుటకు హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా చరణం: 2 పరుగులెన్ని తీసినా టైం మిగలటం చోద్యమయి సరుకులెన్ని తెచ్చినా లోటు తీరడం అసాధ్యమే పొరుగు వాడి సాయముల్ లేకపోవడం లాభమే సొరుగులో రహస్యముల్ బయట పాకితే పాదమే టీవీలతో మిక్సీలతో రోజూ ధ్వనించే ఇంటిలో పోట్లాటలు కొట్లాటలు ఇతరులు వినాలంటే కుదరదు హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా ఓ రోజులో భవసాగరం ఈదాలనే ఆత్రంలో నూరేళ్ళని మూణ్ణాళ్ళలో చూడాలనే కంగారులో డా టడడట్టా టట్టాడడాడడా డట్టా టడడట్టా డట్టాడడాడడా డా టడడట్టా టట్టాడడాడడా డా డడడట్టా డట్టాడడట్టడా
Lyrics sourced from public databases. May contain errors.