Song Details
Lyrics
నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా ఉన్నానా నేనున్ననా ఉన్నానుగా అంటున్నానా వెళ్లొస్తానంటూ.. ఆ నిజం ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా ఏం చేసానని ఏం చూస్తున్నానని అనుకోని ఆ క్షణం నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా చరణం: 1 గాలిలో మేడ గాల్లోనె ఉంటుంది నేలకేనాడు దిగిరాదని నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది చేతికందేది కాదే అది చెప్పాలా ఎవరో కొత్తగా అది నమ్మలేని వింత కాదనీ.. ఏం చేసానని ఏం చూస్తున్నానని అనుకోని ఆ క్షణం నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా ఆ.... ఆ..... ఆ.... చరణం: 2 నన్ను నాలాగ చూపించవేమంటు నిలువుటద్దాన్ని నిందించనా నేను తన లాగ ఏనాడు మారానో నాకు నేనింక కనిపించనా అద్దంలో లోపం లేదనీ నా చూపులోనే శూన్యముందనీ.. ఏం చేసానని ఏం చూస్తున్నానని అనుకోని ఆ క్షణం నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా
Lyrics sourced from public databases. May contain errors.