Song Details
Lyrics
అరనవ్వెలెందుకో .. చిరు సిగ్గులెందుకో తెరచాటు దేనికో చెలియా చెప్పుకో (2) నీ కళ్ళలో కదిలే సంగతీ చెప్పాలనే నీకూ ఉన్నదీ ఏ బిడియమో మొదలైనదీ ఏమో ఎలా అంటున్నదీ .. ఔనా ! Don’t you see my love Don’t you care my love Don’t you love me love Won’t you tell me now ! వెళుతూ .. వెళుతూ .. అడుగే ఆగాలా తిరిగీ .. తిరిగీ .. నన్నే చూడాలా ఎదలో .. ఏదో .. ఉందనిపించేలా కబురే .. చెబుతూ .. కాదనుకోవాలా నీడల్లే నీతోనే ఉంటున్నా వేరేగా చూస్తావేవంటున్నా స్నేహంగా నిన్నే అడిగేస్తున్నా నీలో ఏ మూలో నేను లేనా తెలిసేలా లవ్ యూ అంటే విందామనుకున్నా ! Don’t you see my love Don’t you care my love Don’t you love me love Won’t you tell me now ! అడిగీ .. అడిగీ .. అలుసైపోయానా ఎదిగీ .. కలలో .. నలుసైపోయానా మనలో .. మనకీ .. మోమాటాలేనా మనసే .. కదిలీ .. మౌనం కరిగేనా ఏకాంతం నన్నే చూపిస్తున్నా ఏనాడూ అనవే ఏ మాటైనా ఏ కొంచెం నాపై ప్రేమే ఉన్నా ఈ నిమిషం బదులిస్తావనుకోనా ! ఓ ఓ ఓ హో .. love you .. I love you ! I just see your love I do care your love I do love you love I do tell you now !
Lyrics sourced from public databases. May contain errors.