Song Details
Lyrics
అలగకే అల్లరి వయసా .. అతనిపై ఇకనైనా చెలిమినే కోరిన మనసా .. చేరవే తనలోనా కోపమా నాపైనా ! నా మనసు నీదని మరిచా .. వీడకే కలనైనా తుదకిలా మోడై నిలిచా .. కరగవే కాస్తైనా చూపవే నాపై ప్రేమా ! ఇన్నినాళ్ళు నా పయనంలోనా .. గమ్యమొక్కటే ప్రేమనుకున్నా వేకువల్లే దారి చూపు నిను విడిచానా నన్ను దాచినా దాగని తపనా .. ఉన్నపాటుగా ఈ ఎదలోనా వెల్లువాయె పంతమేదో తాకుతు ఉన్నా కాలమెంతగా గాలమేసినా చిన్ని గుండెలో ఆశ జారునా నీడై సాగి నీతో రానా .. ప్రేమే దోబూచులే ఆడినా ! అలగకే అల్లరి వయసా .. అతనిపై ఇకనైనా చెలిమినే కోరిన మనసా .. చేరవే తనలోనా కోపమా నాపై ఇంకా ! గువ్వలా నువ్వుంటే .. రెక్కలే అడిగానా పంజరంలో ఉంచీ .. ప్రేమ అనుకున్నానా నీ కలకి కాస్తైనా .. నీడలో రాలేనా నా కనులనే విడిచీ .. నన్ను చూస్తున్నానా నిజమే తెలిసీ నిలిచానా .. నీలోనా ! నా మనసు నీదని మరిచా .. వీడకే కలనైనా తుదకిలా మోడై నిలిచా .. కరగవే కాస్తైనా చూపవే నాపై ప్రేమా !
Lyrics sourced from public databases. May contain errors.