Song Details
Lyrics
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీనుల విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా మజా మజాఘుమా ఘుమాలయా నిజానికి ఇదంత ఒట్టు నీదయ చరణం: 1 పువ్వులెన్నో విచ్చినట్టుగా చెలీ నవ్వగానే నచ్చినావులే చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చూసుకోరా పట్టి కౌగిలి ఖవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసి జగడమొకటి సాగిందోయమ్మో అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి లలిత కవిత నీకే మాలగా దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై వంశధార నీటి మీద హంసలేఖ రాసిన ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా నిజానికి ఇదంత ఒట్టు నీదయ చరణం: 2 సమ్ముఖాన రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే చందమామతోటి బేరమా అదే అందగత్తె గొప్పకాదులే పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నో కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మా సరాగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటే పరువమొకటి వచ్చే వాంఛలా కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడి జుంటి తేనెమత్తులోన కొంటె వేణువూదినా గీత గోవిందుడు వీనుల విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా మజా మజా మజాఘుమా ఘుమాలయా నిజానికి ఇదంత ఒట్టు నీదయ ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Allari Priyudu
See AllCheppaka Ne Chebuthunnadi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Em Pilladi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Pranayama Ni Peremiti Pralayama
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Andama Ne Peramiti
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Aho Oka Manasuku
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Rose Rose Rose Roja Puvva
S.P. Balasubrahmanyam, K.S. Chithra