Song Details
Lyrics
ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా గమ్యం తెలియని పయనమా ప్రేమకు పట్టిన గ్రహణమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా చరణం: 1 ప్రేమ కవితా గానమా నా ప్రాణమున్నది శ్రుతి లేక గేయమే ఎద గాయమైనది వలపు చితిని రగిలించగా తీగచాటున రాగమా ఈ దేహమున్నది జత లేక దాహమారని స్నేహమై ఎద శిథిల శిశిరమై మారగా ఓ హృదయమా... ఇది సాధ్యమా... రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా చరణం: 2 ప్రేమసాగర మధనమే జరిగింది గుండెలో ఈవేళ రాగమన్నది త్యాగమైనది చివరికెవరికీ అమృతం తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ అశ్రుధారలే అక్షరాలుగా అనువదించెనా జీవితం ఓ ప్రాణమా... ఇది న్యాయమా... రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Allari Priyudu
See AllCheppaka Ne Chebuthunnadi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Em Pilladi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Andama Ne Peramiti
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Uttarala Urvasi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Aho Oka Manasuku
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Rose Rose Rose Roja Puvva
S.P. Balasubrahmanyam, K.S. Chithra