Song Details
Lyrics
కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే...చెప్పకనే... చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటె మోహపు తెరలిక తొలిగేనా హహా హహా చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటె ఆశల అల్లరి అణిగేనా హహా హహా పదాలతోనే వరించనా సరాగమాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా సుఖాల వీణా శృతించనా ఆ వెన్నెల ఈ కన్నుల రేపెక్కిన ఆ కోరిక పొగలై సెగలై యదలో రగిలిన క్షణమే చెప్పకనే... చెప్పకనే... చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా హహా హహా నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడు మలుపులు తెలిసెననీ హహా హహా తెల్లారనీకే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని సవాలు చేసే శృంగారమా సంధించమాకే ఓ హాయిని ఆ మల్లెల కేరింతలు ఈ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే... చెప్పకనే... చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Allari Priyudu
See AllEm Pilladi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Pranayama Ni Peremiti Pralayama
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Andama Ne Peramiti
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Uttarala Urvasi
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Aho Oka Manasuku
S.P. Balasubrahmanyam, K.S. Chithra
Rose Rose Rose Roja Puvva
S.P. Balasubrahmanyam, K.S. Chithra