MovieGQ

Em Pilladi

Allari Priyudu (1993) · Track 2 of 7 · 5:03

Song Details

Lyrics

ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం కుర్రది కూత బాగున్నది ఓయ్ సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది చెక్కిలి పై కెంపులు నా సొంతం అంది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది బాగున్నది కోడె ఈడన్నది... ఈడందుకే వీధి పాలైనది... కమ్మని కల కళ్ళెదుటకు వచ్చేసింది కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది ఎప్పుడు ఏం కావాలో అడగమన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది మువ్వాకు మువ్వాకు మువ్వాకు మువ్వ మువ్వ మువ్వ మువ్వ మువ్వ మువ్వాకు లవ్వాకు లవ్వాకు లవ్వాకు లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వు లవ్వాకు శనివారం ఎంకన్న సామి పేరు చెప్పి సెనగలట్టు చేత బెట్టి సాగనంపింది మంగళారం ఆంజనేయ సామి పేరు జెప్పి అసలు పనికి అడ్డమెట్టి తప్పుకున్నాది ఇనుకోని ఆరాటం ఇబ్బంది ఇడమరిసే ఈలెట్టా వుంటుంది ఎదలోనే ఓ మంట పుడుతుంది పెదవిస్తే అది కూడా ఇమ్మంటుంది చిరు ముద్దుకి వుండాలి చీకటి అంది ఏ కళ్ళు పడకుంటే ఓకే అంది తీరా ముద్దిస్తుంటే ఎంగిలన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది ముద్దాకు ముద్దాకు ముద్దాకు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దాకు సిగ్గాకు సిగ్గాకు సిగ్గాకు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గాకు సుక్రారం మాలచ్చిమి నీకు సాటి అంటూ పట్టు చీర తెచ్చి పైట చుట్టమన్నాడు సోమారం జామురాతిరి తెల్ల చీర తెచ్చి మల్లెపూల కాపడాలు పెట్టమన్నాడు ఉత్సాహం ఆపేది కాదంట ఉబలాటం కసిరేస్తే పోదంట ఉయ్యాల జంపాల కధలోనే ఉ కొట్టే ఉద్యోగం నాదంట వరసుంటే వారంతో పని ఏముంది ఉత్తుత్తి చొరవైతే ఉడుకేముంది మల్లి కావాలన్నా మనసు వున్నది వామ్మో ఏం పిల్లది ఎంత మాటన్నది... బాగున్నది కోడె ఈడన్నది... సిగ్గులపురి చెక్కిలి తనకుంది అంది కొమ్మకు జత వీడేనని ఒట్టేసింది ఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది ఏం పిల్లది ఎంత మాటన్నది బాగున్నది కోడె ఈడన్నది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Allari Priyudu

See All