Ammammo Ammo
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Kalyani Malik
Lyrics
- అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే
మాటల్లో ముంచే అల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా
గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా
చేతల్లో అన్నీ అందునా
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల
ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు
అవి కావా మా ఆస్తులు
మ్మ్...ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలు
తర్వాత అవి కసురులు
అన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన ఐ యామ్ సారీ అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్‌గా నో అందురు
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల
కన్నీటి బాణమే వేసేటి విద్యలో
ముందుంది మీరే కదా
హే మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్సులో
డిస్టెన్క్షన్ మీదే కదా
కన్నీరైనా మౌనం అయినా చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించకు
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా
గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా
చేతల్లో అన్నీ అందునా
Ala Modhalaindhi
Movie More SongsAmmammo Ammo Keyword Tags
-
-